రాష్ట్రానికి మరింత యూరియా కావాలి: కేంద్రాన్ని కోరిన మంత్రి నిరంజన్ రెడ్డి

రాష్ట్రానికి మరింత యూరియా కావాలి: కేంద్రాన్ని కోరిన మంత్రి నిరంజన్ రెడ్డి

రబీసీజన్ కు కావల్సిన ఎరువు కంటే ఎక్కువ కావాలని కేంద్ర మంత్రి సదానంద గౌడను కలిసి వినతి పత్రం ఇచ్చారు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన…  ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా మొదలైనా..  భూమి ఎక్కువగా సాగులోకి వచ్చిందని తెలిపారు. మామూలుగా అయితే…  రబీ కోసం ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని చెప్పారు. అయితే వర్షాలు ఎక్కువగా పడటంతో… మరో 8లక్షల ఎకరాలు అదనంగా సాగులోకి వస్తాయని.. ఇందుకొరకు మరో 70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరముందని కేంద్రానికి తెలిపినట్లు చెప్పారు. ఇందుకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ముందుగా మంజూరు అయిన ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో ముందస్తుగా… 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా తొందరలోనే కేంద్రం పంపించనుందని చెప్పారు. దీంతో పాటే అదనంగా కోరిన యూరియాను కూడా రిలీజ్ చేయాలని కేంద్ర మంత్రిని కోరనట్లు తెలిపారు.