- ఇందులో 16 కుల, వృత్తిదారుల కార్పొరేషన్లు, ఫెడరేషన్లు
- తెలుగు అకాడమీ చైర్మన్‌గా ప్రొఫెసర్ వెంకట నారాయణ
- గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్‌గా సూదిని రామిరెడ్డి
- జూన్ లోపు అన్ని నామినేటెడ్ పదవుల భర్తీ: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: ఎట్టకేలకు18 రాష్ట్రస్థాయి కార్పొరేషన్, ఫెడరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్ లను నియామిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 16 కుల సంఘాలు, వృత్తిదారుల కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఉండగా, మిగిలిన రెండింటిలో ఒకటి తెలుగు అకాడమీ, మరొకటి గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ ఉన్నాయి. తెలుగు అకాడమీ చైర్మన్ గా ప్రొఫెసర్ వెంకట నారాయణ, గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్ గా సూదిని రామిరెడ్డి, సభ్యులుగా కృష్ణ కుమార్, బూస వేణు గోపాల్ యాదవ్ నియమితులయ్యారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ల పాటు వీరు ఆయా పదవుల్లో కొనసాగుతారు.
పెండింగ్ నామినేటెడ్ పదవులు
జూన్ లోగా భర్తీ చేస్తాం: పీసీసీ చీఫ్
రాష్ట్రంలోని మిగతా కార్పొరేషన్, ఫెడరేషన్, ఇతర కమిషన్ల చైర్ పర్సన్, వైస్చైర్పర్సన్స్థానాలన్నింటినీ త్వరలోనే భర్తీ చేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం గాంధీ భవన్ మీడియా సమావేశంలోనే కార్పొరేషన్, ఫెడరేషన్ ఛైర్మన్ ల నియామక ప్రకటనను విడుదల చేసిన పీసీసీ చీఫ్ ..ఆ తర్వాత మాట్లాడుతూ జూన్ లోగా అన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని, పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పదవులు దక్కుతాయన్నారు. బడుగు, బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే ఇప్పుడు పదవులు కట్టబెట్టామని చెప్పారు.ఇక కుల సంఘాలు, చేతి వృత్తుల కార్పొరేషన్లు, ఫెడరేషన్ల నియామకాలు ఇలా ఉన్నాయి.
కార్పొరేషన్/ఫెడరేషన్ చైర్మన్ వైస్‌చైర్మన్
1 . బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ బస్వరాజు శ్రీనివాస్ పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్
2 . రజక సహకార సంస్థ లిమిటెడ్ డాక్టర్ దాసరిరాజు అజయ్ కుమార్ బంగారు బాబు
3 . గౌడ సహకార సంస్థ కార్పొరేషన్ మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్ కె. నాగరాజు గౌడ్
4 . పెరిక సహకార సంస్థ కార్పొరేషన్ దొంగరి వెంకటేశ్వర్లు బుడగం శ్రీనివాస్
5 . మేర సహకార సంస్థ కార్పొరేషన్ సంగ వెంకటరాజం ఎం. లక్ష్మీ నారాయణ
6 . వాల్మీకి బోయ సహకార సంస్థ కార్పొరేషన్ గట్టు తిమ్మప్ప బోయ నాగేష్
7 . మున్నూరుకాపు సహకార సంస్థ బొమ్మ శ్రీరామ్ అల్లం భాస్కర్
8 . యాదవ సహకార సంస్థ ఎం. రఘునాథ్ యాదవ్ గజ్జి భాస్కర్
9 . వడ్డెర సహకార సంస్థ గుంజా రేణుక నారాయణ బత్తుల వెంకటేశ్
10 . తెలంగాణ చేనేత అభివృద్ధి సంస్థ దూడెం వెంకట్ రమణ జక్కని అనిత
11 . కమ్మ కార్పొరేషన్ బండి రమేశ్ పరుచూరి మురళి
12 . పద్మశాలి సహకార కార్పొరేషన్ గూడూరు శ్రీనివాస్ -
13 . తెలంగాణ భట్రాజు సహకార సంఘాల సమాఖ్య సీహెచ్ బాల్ రాజ్ -
14 . వెలమ కార్పొరేషన్ జువ్వాడి నర్సింగరావు -
15 . తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య కొల్లె సరిత -
16 .తెలంగాణ పశుసంవర్ధక అభివృద్ధి సంస్థ చరణ్ కౌశిక్ యాదవ్ -
