
హైదరాబాద్, వెలుగు: ఆర్టీఐ కొత్త కమిషనర్లుగా పీవీ.శ్రీనివాస రావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్య రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సెక్రటేరియెట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. కొత్తగా నియమితులైన కమిషనర్లతో ఆర్టీఐ చీఫ్ కమిషనర్ జి.చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా కొత్త కమిషనర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రమాణ స్వీకారం అనంతరం అక్కడే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి సరదాగా మాట్లాడారు. ‘‘యుద్ధం విషయంలో మీరు (బీజేపీ) ఏం చేయలేకపోయారు. మీకంటే ముందు మేము గతంలో ఎప్పుడో చేసి చూపించాం’’అని రాకేశ్ రెడ్డితో సీఎం అన్నారు. దీనిపై రాకేశ్ రెడ్డి స్పందిస్తూ.. ‘‘మేము చేయాల్సింది చేశాం. ఇంకా చేయాల్సింది ఉంది’’అని రాకేశ్ రెడ్డి బదులిచ్చారు.