సెప్టెంబర్ 10 నుంచి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు

సెప్టెంబర్ 10 నుంచి తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు

హైదరాబాద్, వెలుగు: ఈ నెల10 నుంచి17 వరకు వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించాలని సీపీఎం  రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. గురువారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన సెక్రటేరియేట్ మీటింగ్​జరిగింది. నిజాం నవాబులు, జాగీర్ దార్లు, జమీందార్లకు, భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారని నేతలు గుర్తుచేశారు. 

అయితే, దాన్ని బీజేపీ సర్కారు వక్రీకరిస్తుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో  ఈ నెల 10 నుంచి 17 వరకు అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో వీర తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను నిర్వహించాలని పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్​లో ఆదివారం సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందాకరత్, బీవీ రాఘవులుహాజరుకానున్నారని పేర్కొన్నారు.