హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఈనెల 16కి వాయిదా పడింది. ఈమేరకు శాసనసభను ఒకరోజు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 14న వినాయక చవితి నేపథ్యంలో సభకు 3 రోజులు బ్రేక్ ఇచ్చారు. తిరిగి సెప్టెంబర్16న (బుధవారం)ఒక్కరోజే అసెంబ్లీ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎల్‌నినోపై చర్చ జరగనుంది.
వర్షాభావ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, రైతుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులు చర్చించనున్నారు. అలాగే, నిషేధిత భూముల జాబితా (22ఏ) అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో వైపు కౌన్సిల్ నిరవధిక వాయిదా పడింది.
