18,19న తెలంగాణ అసెంబ్లీ

18,19న తెలంగాణ అసెంబ్లీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఈనెల 18, 19వ తేదీల్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్‌‌‌‌ నరసింహన్‌‌‌‌ శుక్రవారం నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేశారు. కొత్త మున్సిపల్‌‌‌‌ చట్టం ఆమోదం కోసం రెండు రోజులు అసెంబ్లీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 18న ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశమవుతుంది. 19న మధ్యాహ్నం 2 గంటలకు శాసన మండలి సమావేశమవుతుంది. 18న కొత్త మున్సిపల్‌‌‌‌ చట్టాన్ని సభలో సీఎం కేసీఆర్‌‌‌‌ ప్రవేశపెడుతారు. తర్వాత సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. 19న ఉద యం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు దీనిపై చర్చిస్తారు. చట్టానికి శాసనసభ ఆమోదం తెలుపగానే నిరవధికంగా వాయిదా వేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు మండలిలో జరిగే చర్చలో సీఎం పాల్గొంటారు. ఆ రోజు సాయంత్రమే బిల్లుకు మండలి ఆమోదం తెలుపుతుంది. వెంటనే నిరవధికంగా వాయిదా వేస్తారు.