ప్రారంభమైన అసెంబ్లీ స‌మావేశాలు

ప్రారంభమైన అసెంబ్లీ స‌మావేశాలు

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు మూడో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాలు కొన‌సాగుతున్నాయి. ప్ర‌శ్నోత్తరాలు ముగిసిన వెంట‌నే ప‌ద్దుల‌పై చ‌ర్చించ‌నున్నారు. ఈ నెల 7న ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. నిన్న బ‌డ్జెట్‌పై చ‌ర్చ జ‌రిగిన త‌ర్వాత మంత్రి హ‌రీశ్‌రావు స‌మాధానం ఇచ్చారు. 15వ తేదీ వ‌ర‌కు అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగ‌నున్నాయి.