ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్ పై నిషేధం

ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్ పై నిషేధం

ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్ పై తెలంగాణ సర్కారు నిషేధం విధించింది. రానున్న రోజుల్లో కొత్తగా నియామకమయ్యే డాక్టర్లకు ప్రైవేటు ప్రాక్టీస్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మెడికల్ ఎడ్యుకేషన్ రూల్స్ ను సవరిస్తూ  రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ జీవో విడుదల చేసింది. నాన్ టీచింగ్ నుంచి టీచింగ్ వరకు ప్రభుత్వ వైద్యులంతా ఓపీ సమయంలో డ్యూటీ చేయకుండా.. బయటికెళ్లి క్లినిక్స్ నడుపుతున్నారనే అభియోగాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  ప్రైవేటు ప్రాక్టీస్ ను బ్యాన్ చేసే ముందు.. ప్రభుత్వ వైద్యులకు ఇన్సెంటివ్స్ ను ప్రకటిస్తే బాగుంటుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఏకపక్షంగా ఇటువంటి నిర్ణయాల తీసుకోవడం సరికాదని సూచిస్తున్నారు.