
- ఉదయం నుంచే నిరసనలు.. ధర్నాలు
- స్వచ్ఛందంగా పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి
- మద్దతు తెలిపిన అన్ని పార్టీలు, సబ్బండ వర్గాలు
- అడ్డుకునేందుకు సర్కారు సన్నాహాలు
- బస్ డిపోల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు
- బస్సులను అడ్డుకుంటే అరెస్టులు చేయాలని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు జోనల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించింది. ప్రస్తుతానికి పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన గెజిట్ పబ్లిష్ చేయగా, రెండు రోజుల్లో ప్రక్రియ మొత్తం ముగించే అవకాశముంది.
సమస్యలను వెంటనే పరిష్కరించాలని సమ్మె బాట పట్టిన ఆర్టీసీ కార్మికులు శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు అన్ని వర్గాల మద్దతు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా బంద్‌ను అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే.. సక్సెస్ చేయాలని కార్మికుంతా పట్టుదలగా ఉన్నారు. శనివారంఉదయం నుంచే ఆర్టీసీ బస్ డిపోలు, బస్టాండ్ల వద్ద నిరసనలు, ధర్నాలు చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అధికార టీఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్‌కు మద్దతు తెలిపాయి. బీజేపీ, కాంగ్రెస్, టీజేఎస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, జనసేన సహా అన్ని పార్టీలు బంద్‌లో పాల్గొంటామని ప్రకటించాయి.
కలిసొస్తున్న పార్టీలు, సంఘాలు
జాతీయ బీసీ సంక్షేమ సంఘం, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, ఎమ్మార్పీఎస్, మాల మహానాడు తదితర సామాజిక సంఘాలు సంఘీభావం తెలిపాయి. సమ్మెకు ఇప్పటికే మద్దతు ప్రకటించామని, బంద్‌కు కూడా సంఘీభావం తెలుపుతున్నామని రెవెన్యూ సంఘాలు వెల్లడించాయి. ఉద్యోగులంతా భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలను ధరించి రాష్ట్రంలో అన్ని తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలపాలని పిలుపునిచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు కూడా బంద్‌కు మద్దతు తెలిపాయి. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతామని ఉద్యోగుల జేఏసీ ఇప్పటికే ప్రకటించింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా, తమ సమస్యల పరిష్కారం కోసం ఓలా, ఉబర్ క్యాబ్‌లతోపాటు ప్రైవేట్ టాక్సీలు నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు తెలంగాణ టాక్సీ డ్రైవర్ల జేఏసీ తెలిపింది. లెక్చరర్స్ జేఏసీ, జానపదకళాకారుల సంఘం కూడా బంద్‌కు మద్దతు ప్రకటించాయి.