V6 News

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో  శ్రీపాద రావుకు నివాళి

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో  శ్రీపాద రావుకు నివాళి

న్యూఢిల్లీ, వెలుగు: దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు వర్ధంతిని  రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా సోమవారం భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో శ్రీపాద రావు చిత్రపటానికి తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డా. శశాంక్ గోయల్ పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం శ్రీపాద రావు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రాయోజిత పథకాల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్, తెలంగాణ భవన్ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.