గడప గడపకూ.. ‘‘సాలు దొర.. సెలవు దొర’’

గడప గడపకూ.. ‘‘సాలు దొర.. సెలవు దొర’’
  •  ప్రతి గడపకు తీసుకెళ్లాలని నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు: ‘‘సాలు దొర‌‌‌‌.. సెలవు దొర’’ నినాదంతో సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని బీజేపీ నిర్ణయించింది. సోషల్‌‌ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయనుంది. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తోంది. చిన్న చిన్న వీడియోలు, స్కిట్స్‌‌, పాటలు రూపొందిస్తోంది. దీనికి సంబంధించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌‌ ఇప్పటికే పలువురు కళాకారులతో, సీనియర్‌‌ నాయకులతో చర్చించారు. కొన్ని పాటలను రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయితలతో రాయిస్తున్నారు. అందులో కొన్నింటిని గురువారం మీడియాకు విడుదల చేశారు. ఇప్పటికే రాష్ట్ర సర్కార్ నిధుల దుర్వినియోగంపై ఆర్టీఐ కింద వందల సంఖ్యలో బీజేపీ దరఖాస్తులు చేసింది. ఇప్పుడు కేసీఆర్​కు  వ్యతిరేకంగా ప్రచారంలో దూకుడు పెంచింది.