మండలాల్లో బీజేపీ నేతల మకాం.. 500 మంది ఎంపిక

మండలాల్లో బీజేపీ నేతల మకాం.. 500 మంది ఎంపిక

మండలాల్లో బీజేపీ నేతల మకాం 
ఈ నెల 19 నుంచి 26 వరకు అక్కడే
500 మందిని ఎంపిక చేసిన  పార్టీ రాష్ట్ర నాయకత్వం
 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న పార్టీ సీనియర్ నేతలు మండలాల్లో మకాం వేయనున్నారు. ఇందుకోసం ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం సుమారు 500 మందిని ఎంపిక చేసింది. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో ఉన్న సీనియర్ నేతలకు ఈ బాధ్యతలు అప్పగించనుంది. వీరికి ఈ నెల 16న హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. గ్రౌండ్‌ లెవల్‌లో వీరు నిర్వహించాల్సిన విధులు, బాధ్యతలపై ఇందులో వివరించనున్నారు. ఈ నెల 19 నుంచి 26 వరకు వారం రోజుల్లో వీరంతా తమకు కేటాయించిన మండలాల్లో కనీసం మూడ్రోజుల పాటు ఉండాలి. కొందరికి రెండేసి మండలాలు అప్పగించారు. మండలంలో పార్టీ పరిస్థితి, బీజేపీ నాయకుల పనితీరు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, స్థానికంగా ఉన్న ప్రధాన సమస్యలు, బూత్ కమిటీల నియామకం, కేసీఆర్ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను ఈ సందర్భంగా నేతలు తెలుసుకుంటారు. ఆ తర్వాత రాష్ట్ర పార్టీకి నివేదిక ఇవ్వనున్నారు. రాబోయే ఎన్నికల్లో మండల స్థాయిలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడమే ప్రధాన ఉద్దేశంగా పార్టీ రాష్ట్ర నాయకత్వం...హైకమాండ్ ఆదేశంతో ఈ ప్రోగ్రామ్‌ను చేపట్టింది.