Telangana budget 2024 : తెలంగాణ బడ్జెట్ అప్ డేట్స్

Telangana budget 2024 : తెలంగాణ బడ్జెట్ అప్ డేట్స్

తెలంగాణ  అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి శ్రీధర్ బాబు 2024  ఓటాన్ అకౌంట్  బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరటం.. పార్లమెంట్ ఎన్నికల క్రమంలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలను జనవరి 12 కు వాయిదా వేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. 

 తెలంగాణ బడ్జెట్ 

 • 2024-25 రూ.2,75,891 కోట్లు 
 • రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు
 • ద్రవ్యలోటు రూ. 32,557 కోట్లు
 • రెవెన్యూ మిగులు రూ. 5,944 కోట్లు

 ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రసంగంలోని ముఖ్యాంశాలు

 •  కాళేశ్వరం లాంటి భారమైన ప్రాజెక్టులపై ఆలోచన చేస్తాం
 • జయజయహే తెలంగాణను రాష్ట్ర అధికారిక గేయంగా ప్రకటించాం
 • తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పులు 
 • వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్   టీఎస్ ను టీజీగా మార్చాం
 • తెలంగాణ కీర్తిని ప్రతిబింబించేలా చిహ్నం
 • నంది అవార్డులను ఇక ముందు గద్దర్ అవార్డుల పేరుతో ఇస్తాం
 • ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తాం
 • అటవి ప్రాంతాలను టూరిజం ప్రాంతాలుగా అభవృద్ధి చేస్తాం
 •  రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం అనే మాట వినకూడదు
 • డ్రగ్స్ కు బానిసలు కాకుండా తెలంగాణ యువతను కాపాడుతాం
 • హుక్కా సెంటర్లను నిషేదించాం
 • తెలంగాణ హైకోర్టుకు 100 ఎకరాలను కేటాయించాం
 •  దేశంలోనే అతిపెద్ది అడవి బిడ్డల జాతర మేడారం
 •  మేడారం జాతరకు రూ.110కోట్లు విడుదల చేశాం
 • త్వరలో టెంపుల్ పాలసీ తీసుకొస్తాం
 •  వేలాది ఎకరాల ఆలయ భూములు అన్యాక్రాంతం అయ్యాయి
 • వేములవాడ, భద్రాచలం, బాసర అభివృద్ధికి కార్యాచరణ
 • ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తాం
 • ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ. 5లక్షలు ఇచ్చేందుకు ప్రణాళికలు
 • 65 ఐటీఐలను ప్రైవేట్ భాగస్వామ్యంతో  అభివృద్ధి చేస్తాం
 • తెలంగాణలో స్కిల్ యూనివర్శిటీ సెంటర్ ఏర్పాటు
 •  రింగ్ రోడ్డుకు భూ సేకరణను వేగవంతం చేశాం
 • 24 గంటల నిరంతర విద్యుత్ కు కట్టుబడి ఉన్నాం
 • ప్రజావాణిలో రెండు నెలల్లో వచ్చిన దరఖాస్తులు 43,054
 • ఇళ్ల కోసం వచ్చినవి 14,951
 • యువజన సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
 •  జాబ్ క్యాలెండర్ రూపొందించే ప్రక్రియ చేపట్టాం
 • గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం
 • గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృత్రిమ మేధ ఉపయోగిస్తాం
 • ఐటీ రంగంలో నైపుణ్యాభివృద్ధికి నూతన పాలసీ
 • ఐటీ విస్తరణకు అమెరికాలోని ఐటీ సర్వ్‌ సంస్థతో సంప్రదింపులు
 • దేశంలోనే అత్యంత పటిష్ఠమైన ఫైబర్‌ నెట్‌వర్క్‌ కనెక్షన్లు ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం
 •  కేమ్స్ తరహాలో మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి
 • వైద్య సిబ్బందిని త్వరలోనే భర్తీ చేస్తాం
 • రాష్ట్రం నలుమూలల క్లస్టర్స్ ఏర్పాటు
 • హైదరాబాద్ లో అంతర్జాతీయ సదుపాయాల కోసం కృషి
 • రాష్ట్రంలో పగడ్భందీగా పంట భీమా
 • కౌలు రైతులకు కూడా రైతు భీమా వర్తింప జేస్తాం
 • నకిలీ విత్తనాల కట్టడికి కఠిన చర్యలు 
 • ధరణి  కొంత మందికి భరణంగా..చాలా మందికి భారంగా మారింది
 • కొంతరు రైతులు సొంత భూములను అమ్ముకోలేని పరిస్థితి
 • ఇదంతా లోపభూయిష్టమైన ధరణితోనే సమస్యలు
 • రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళనకు చేసేందుకు ఐదుగురితో  కమిటీతో కమిటీ వేశాం
 • త్వరలోనే రైతు రుణమాఫీ కార్యాచరణ
 • ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం
 •  డై పోర్టుల నిర్మాణానికి మాస్టర్ ప్లాన్
 •  పీఎం మిత్ర నిధులతో మెగా టెక్స్ టైల్  పార్క్ అభివృద్ధి
 • ప్రతి మండలంలో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్

 శాఖలకు కేటాయింపులు ఇలా..

 • మహాలక్ష్మి స్కీం కోసం ఆర్టీకి నెలకు రూ.300 కోట్లు
 • రైతుబంధు ఎకరానికి ఏటా రూ. 15 వేలు
 • గురుకులాలకు రూ. 1546 కోట్లు
 • పరిశ్రమల శాఖకు రూ. 2543
 • తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు రూ.  500 కోట్లు
 • ఉపాధి కల్పణ జోన్ గా మూసీ పరివాహక ప్రాంతం
 • యూనివర్శిటీల్లో సదుపాయాలకోసం రూ. 500 కోట్లు
 • ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు
 • తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల కోసం రూ.  300 కోట్లు
 • గృహ నిర్మాణానికి రూ. 7540 కోట్లు
 • బీసీ సంక్షేమం కోసం రూ.8000 వేల కోట్లు
 • గురుకులాల సొంత భవనాల కోసం రూ. 1546
 • ట్రాన్స్ కో,డిస్కంలకు  రూ.16,825 కోట్లు
 • పంచాయతీ రాజ్ శాఖకు రూ. 40,080 కోట్లు
 • త్వరలో రైతురుణమాఫీపై రూపకల్పన
 • మూసీ ప్రాజెక్టుకు రూ. 1000 కోట్లు
 • విద్యా రంగానికి రూ. 21,389 కోట్లు
 • ఇరిగేషన్ కు  రూ.  28,024 కోట్లు
 • ఐటీ శాఖకు రూ. 774 కోట్లు
 • గృహజ్యోతి పథకానికి రూ. 2418 కోట్లు
 • మున్సిపల్ శాఖకు రూ. 11692 కోట్లు
 • టీఎస్ పీఎస్ సీ కి రూ. 40 కోట్లు కేటాయింపు
 • త్వరలో కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం
 •  ఎస్సీ సంక్షేమం కోసం 21,874 కోట్లు
 • ఎస్సీ సంక్షేమం కోసం రూ.,13 వేల 13 కోట్లు
 • ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు
 • వైద్యరంగానికి రూ. 11,500 కోట్లు
 • వ్యవసాయానికి రూ. 19,746
 • గృహ నిర్మాణానికి  రూ.7,540 కోట్లు
 • మైనార్టీ సంక్షేమానికి రూ. 2,262 కోట్లు
 • అమరుల కలలను నిజం చేస్తాం

 
 • ప్రజలకు అందుబాటులో ఉండే పాలనకు శ్రీకారం
 • తెలంగాణ ప్రజల్లో మార్పు తీసుకొస్తాం
 • అందరికీ మనమందరం అనే స్పూర్తితో ముందుకెళ్తాం
 • కేసీఆర్ ప్రభుత్వం దళిత బంధు కోసం రూ.17 వేల కోట్లు ఖర్చు అవుతుంటే.. బడ్జెట్ లో ఒక్క రూపాయి కేటాయించలేదు
 • ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీసుకొచ్చారు.
 •  అప్పులు తీసుకోవటానికి కూడా ఉద్యోగులు ఇబ్బంది పడే రోజులు తీసుకొచ్చారు
 • ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం..
 •  తొలి ఫైల్ పై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేయటం ఇందుకు నిదర్శనం
 • కొత్త ప్రభుత్వం తొలి అడుగులో సంక్షేమానికి నాంది పలికింది
 • రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం రిలీజ్ చేశాం.
 • అందరి కోసం బడ్జెట్ ను రూపొందించాం
 • అమరుల కలలను నిజం చేస్తాం
 • కొత్త ప్రభుత్వం తొలి అడుగులో సంక్షేమానికి నాంది పలికింది
 • మార్పును కోరుతూ తెలంగాణ సమాజాం స్వేచ్ఛను సంపాదించుకుంది
 • తెలంగాణ అమరవీరులు దేని కోసం త్యాగం చేశారో వాటిని నెరవేరుస్తాం
 • పదేళ్ల తర్వాత నిజమైన స్వేచ్ఛను చూస్తున్నాం
 • అందరి కోసం బడ్జెట్ ను రూపొందించాం

 

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది తెలంగాణ కేబినెట్‌. అసెంబ్లీలో  వార్షిక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024- 25 ను ప్రవేశపెట్టనున్న సందర్భంగా ఫిబ్రవరి 10వ తేదీ శనివారం  రాష్ట్ర మంత్రివర్గం సమావేశం నిర్వహించి.. బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆర్థకశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ..  బడ్జెట్ లో అన్ని అంశాలు ఉంటాయని చెప్పారు. పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. ఆస్తులు.. అప్పులతో పాటు కేంద్రం నుండి వచ్చే ఆదాయంపైనా బడ్జెట్‌ ప్రసంగంలో ఉంటాయని ఆయన చెప్పారు.