V6 News

ఏప్రిల్  23న రాష్ట్ర కేబినెట్ సమావేశం..

ఏప్రిల్  23న రాష్ట్ర కేబినెట్ సమావేశం..
  • ఏప్రిల్ 30 కల్లా మెట్రో పూర్తిగా ప్రభుత్వపరం

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 23న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియెట్​లో మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది. ఈ మేరకు అజెండా, పెండింగ్ అంశాలను పంపాలని సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. మెట్రో టెకోవర్​కు సంబంధించి కూడా ఫైనల్ అప్రూవల్ కేబినెట్​లో తీసుకోనున్నారు. ఏప్రిల్ 30 కల్లా మెట్రోను ప్రభుత్వం పూర్తిగా టేకోవర్ చేసేలా ముందుకు వెళ్తున్నది. భూముల విలువల సవరణ అంశం కూడా కేబినెట్ దృష్టికి తీసుకురానున్నట్లు తెలిసింది. పలు సంస్థలకు, కంపెనీలకు భూకేటాయింపులపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.