ఇయ్యాల(అక్టోబర్16) కేబినెట్‌‌ భేటీ

ఇయ్యాల(అక్టోబర్16) కేబినెట్‌‌ భేటీ

సీఎం రేవంత్‌‌రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియెట్‌‌లో 
మధ్నాహ్నం 3 గంటలకు సమావేశం
బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు, 
ధాన్యం కొనుగోళ్లు, మెట్రోపై చర్చ
ఇరిగేషన్​ ప్రాజెక్టులు, ఎస్‌‌ఎల్‌‌బీసీ పనులపై 
డిస్కషన్‌‌.. పలు నిర్ణయాలు

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియెట్‌‌‌‌లో గురువారం మధ్యా హ్నం 3 గంటలకు కేబినెట్‌‌‌‌ భేటీ జరుగనున్నది.  ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులపై చర్చించే అవకాశం ఉన్నది. వానాకాలం ధాన్యం సేకరణ, మెట్రో రైలు ఫేజ్–1ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, రెండో ఫేజ్​ ప్రాజెక్టు పనుల ప్రారంభం.. తదితర అంశాలు చర్చకు రానున్నాయి. 

మెట్రో రైలు ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి ఎల్‌‌‌‌ అండ్‌‌‌‌ టీ సంస్థ వైదొలగడంతో ప్రభుత్వమే నిర్వ హణ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నది.  ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ పనులు తిరిగి మొదలుపెట్టడంపైనా కూడా కేబినెట్‌‌‌‌లో చర్చించి నిర్ణయం తీసుకో నున్నారు. దీంతోపాటు మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు, తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం, సమ్మక్క–-సారలమ్మ ప్రాజెక్టు ఆనకట్ట, దేవాదుల ఆరో ప్యాకేజీలాంటి విషయాలు చర్చకు రానున్నట్లు తెలిసింది.  

మూసీ ప్రాజెక్టు, గిగ్‌‌‌‌ వర్కర్ల సంక్షేమ చట్టం, టీ -ఫైబర్‌‌‌‌ విస్తరణ, ఫ్యూచర్‌‌‌‌ సిటీ అంశాలు కేబినెట్‌‌‌‌ భేటీలో చర్చకు వచ్చే చాన్స్‌‌‌‌ ఉన్నది.