
ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. నాలుగు నెలల తర్వాత సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. గతంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ముందు భేటీ జరిగింది. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు రావడంతో సమావేశం కాలేదు. 18న జరిగే ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. 19న టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు.
21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం జరగనున్న క్రమంలో కీలకంగా చర్చించనున్నారు. ఇటీవల ఆసరా పింఛన్ల కింద ఇచ్చే మొత్తాన్ని పెంచడంతో పాటు రైతుబంధు నిధుల పెంపు అంశంపైనా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు తదితర అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేయనుంది.