డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తుల జప్తు! యంత్రాల వేలానికి సివిల్ సప్లయిస్ శాఖ ఏర్పాట్లు

డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తుల జప్తు! యంత్రాల వేలానికి సివిల్ సప్లయిస్ శాఖ ఏర్పాట్లు
  •  బకాయిల వసూళ్లకు ఆర్​ఆర్​ చట్టాన్ని ప్రయోగించాలని నిర్ణయం

హైదరాబాద్​, వెలుగు :  కస్టమ్‌‌‌‌‌‌‌‌ మిల్లింగ్‌‌‌‌‌‌‌‌ రైస్‌‌‌‌‌‌‌‌, ధాన్యం బకాయిలు చెల్లించని రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లర్లపై రాష్ట్ర సివిల్​ సప్లయ్స్​శాఖ  కఠిన చర్యలకు సిద్ధమైంది. ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ (ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌) చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బకాయిదారుల ఆస్తుల జప్తు, మిల్లింగ్‌‌‌‌‌‌‌‌ యంత్రాల వేలం ద్వారా బకాయిల వసూలుకు చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు సివిల్​ సప్లయ్స్​శాఖ కమిషనర్‌‌‌‌‌‌‌‌, ఎం. స్టీఫెన్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర,  క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

మూడు బ్యాచ్‌‌‌‌‌‌‌‌లుగా నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ తహసీల్దార్లకు బకాయిల వసూలు, చట్టపరమైన చర్యలపై మార్గనిర్దేశం చేశారు. బకాయిదారులను గుర్తించేందుకు ఫిజికల్‌‌‌‌‌‌‌‌ వెరిఫికేషన్‌‌‌‌‌‌‌‌ (పీవీ) మొబైల్‌‌‌‌‌‌‌‌ యాప్‌‌‌‌‌‌‌‌ను వినియోగించనున్నారు. ప్రతి బుధవారం రైస్‌‌‌‌‌‌‌‌ మిల్లుల్లో ఆకస్మికంగా నిల్వల తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. తర్వాత దశలో జిల్లా సివిల్​ సప్లయ్స్​ అధికారులు, జిల్లా మేనేజర్లకూ  ఇదే తరహా శిక్షణ ఇవ్వనున్నారు.