బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

బీఆర్ఎస్  పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం

బీఆర్ఎస్  పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది.  మధ్యాహ్నం 1 గంటకు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం మొదలైంది. ఈ నెల 31 నుంచి కేంద్ర బడ్జెట్  సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటులో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బడ్జెట్‌లో కేటాయింపులు, కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు, కేంద్రం నెరవేర్చని విభజన హామీలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్రం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.