ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచొద్దు : కలెక్టర్ చాహత్బాజ్పాయ్

ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచొద్దు : కలెక్టర్ చాహత్బాజ్పాయ్

హనుమకొండ కలెక్టరేట్/ భూపాలపల్లి రూరల్/ కాశీబుగ్గ/ భద్రాచలం, వెలుగు:  ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్​లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లు ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్​లో నిర్వహించిన గ్రీవెన్స్​లో ప్రజల నుంచి వచ్చిన 268 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్​ చాహత్​బాజ్​పాయ్​తెలిపారు.

జయశంకర్​ భూపాలపల్లిలో 78 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్​ రాహుల్​శర్మ పేర్కొన్నారు. వరంగల్​కలెక్టరేట్​లో కలెక్టర్​ సత్యశారద 192 అర్జీలు, బల్దియాలో 128 అర్జీలను కమిషనర్​ టి.వెంకటన్న స్వీకరించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ మీటింగ్​హాల్​లో నిర్వహించిన గిరిజన దర్భార్​లో పీవో బి.రాహుల్​ ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వకరించి, సమస్యలను పరిష్కరించాలని సంబంధిత ఆఫీసర్లను ఆదేశించారు.