అదనంగా ఐపీఎస్లను కేటాయించండి..కేంద్రమంత్రి బండి సంజయ్కి రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల విజ్ఞప్తి

అదనంగా ఐపీఎస్లను కేటాయించండి..కేంద్రమంత్రి బండి సంజయ్కి రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణకు అదనంగా ఐపీఎస్​లను కేటాయించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.బుధవారం పార్లమెంట్ ఆవరణలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ని ఎంపీలు మల్లు రవి, సురేష్ శెట్కార్, వంశీకృష్ణ కలిసి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పోలీసు శాఖపై పెరుగుతున్న పనిభారం దృష్ట్యా అదనపు ఐపీఎస్‌‌లు అవసరమని వివరించారు.