కాంగ్రెస్ మేనిఫెస్టోలో కీలకం : మెగా డీఎస్సీ, ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు

కాంగ్రెస్ మేనిఫెస్టోలో కీలకం : మెగా డీఎస్సీ, ఆటో డ్రైవర్లకు రూ.12 వేలు

కాంగ్రెస్ మేనిఫెస్టోలో చాలా హామీలు ఉన్నాయి. 42 పేజీల్లోని కొన్ని కీలక హామీలను పరిశీలిస్తే.. ఇలా ఉన్నాయి. 

  • తెలంగాణ ఉద్యమ కారులకు 250 గజాల స్థలం, గౌరవ భృతి
  • వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్
  • 3 లక్షల రూపాయల వడ్డీ లేని పంట రుణం
  • రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ
  • కోతుల నివారణకు ప్రతీ జిల్లాలో స్టెరిలైజ్ కేంద్రం
  • కాళేశ్వరం అవినీతి పై సిట్టింగ్ జడ్జితో విచారణ
  • చెరువుల నిర్వాహణ‌, మరమ్మతుల బాధ్యత నీటి సంఘాలకు అప్పగింత
  • తొలి క్యాబినెట్ లోనే మెగా డీఏస్సీ ప్రకటన. 
  • రూరల్ యూత్ ఫైనాన్స్ కార్పోరేషన్ కు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్
  • విద్యార్థులకు ఉచితంగా ఇంటర్ నెట్
  • విద్యా రంగానికి బడ్జెట్ లో 6 నుంచి 15 శాతం వరకు పెంపు
  • ఖమ్మం, ఆదిలాబాద్ లలో నూతన విశ్వవిద్యాలయాలు
  • వైద్య రంగం బడ్జెట్ రెట్టింపు
  • ధరణి స్థానంలో భూమాత పోర్టల్
  • రేషన్ ద్వారా సన్న బియ్యం,  రేషన్ డీలర్లకు 5 వేల రూపాయల గౌరవ భృతి
  • కొత్త రేషన్ కార్డులు జారీ
  • పేదలకు 200 యూనిట్లలోపు ఉచిత కరెంట్
  • ఆర్టీసీని ప్రభుత్వంలో వీలీన పక్రియ పూర్తి చేస్తాం
  • ప్రతి ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం
  • తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బెల్ట్ షాపులు రద్దు 
  • కళ్యాణ మస్తు కింద లక్ష రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం (తులం బంగారం) ఉచితంగా ఇస్తారు
  • మహిళా సంఘాలకు పావులా వడ్డీకే రుణాలు
  • జూనియర్ న్యాయవాదులకు మొదటి 5 సంవత్సరాలు నెలకు 5 వేల రూపాయల గౌరవ భృతి
  • 100 కోట్ల రూపాయలతో జర్నలిస్టులకు సంక్షేమ నిధి
  • హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లో జర్నలిస్టుల ఇళ్ళ సమస్య కు పరిష్కారం
  • ఎన్నారైల సంక్షేమ బోర్డ్ ఏర్పాటు
  • దివ్యాంగులకు నెలకు 6 వేల రూపాయల పెన్షన్
  • దేవాలయాలకు దూప దీప నైవేద్యం కింద నెలకు 12 వేల రూపాయలు

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలోని కీలక హామీలు మాత్రమే ఇవి.. మొత్తం 42 పేజీల్లో ఇంకా చాలా హామీలు ఇవ్వటం జరిగింది.