కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. సెప్టెంబర్ 28నరాష్ట్రవ్యాప్త ఆందోళనలు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. సెప్టెంబర్ 28నరాష్ట్రవ్యాప్త ఆందోళనలు  :  పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా నిరసనలు: మహేశ్ గౌడ్ 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఈ నెల 28న కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టి, దీనిపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా చూడాలని పార్టీ శ్రేణులను ఆయన కోరారు.

గత పది నెలల్లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విబేధిస్తూ ఇతర ఎన్నికల కమిషనర్లు సుఖబీర్ సింగ్ సంధు, వివేక్ జోషి 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారని మహేశ్ గౌడ్ ఆరోపించారు. ఓట్ల తొలగింపు, కొత్త ఓట్ల నమోదు, ఓటర్ల డేటాబేస్ నిర్వహణ, జాబితాకు సంబంధించిన సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ అంశాలపై ఈ అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఫారం-6 లో చేసిన మార్పులపై ఇద్దరు కమిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.