సర్కార్ బడి పిల్లలకు కార్పొరేట్ చదువు: తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి

సర్కార్ బడి పిల్లలకు కార్పొరేట్ చదువు: తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి సర్కారు స్కూల్​విద్యార్థికి కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా అందరు కలిసికట్టుగా పని చేయాలని తెలంగాణ  విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నారు. దీనికి పరస్పర సహకారం, తార్కిక ఆలోచనలు ప్రధాన సూత్రాలుగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్​లో హెడ్మాస్టర్ల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య​అతిథిగా మురళి హాజరై మాట్లాడారు. 

నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు ఒకే ప్రమాణాలు కలిగిన విద్యను అందించడమే తమ కమిషన్ లక్ష్యమని చెప్పారు. నాణ్యమైన విద్యను అందరికీ చేరువ చేసేందుకు మండలానికి మూడు చొప్పున ‘తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఉన్నట్టు తెలిపారు. 

విద్యా బడ్జెట్ 12 శాతానికి తగ్గకుండా ఉన్నప్పుడే ఈ లక్ష్యాలు సాధ్యమవుతాయని ఆయన అన్నారు. సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజగంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరిధర్, ట్రెజరర్​ తుకారాం, గౌరవ అధ్యక్షుడు సర్దార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.