సీబీఎస్ఈ ఫలితాల్లో ఏకలవ్య స్టూడెంట్స్ సత్తా..99.9శాతం మంది పాస్

సీబీఎస్ఈ ఫలితాల్లో ఏకలవ్య స్టూడెంట్స్ సత్తా..99.9శాతం మంది పాస్

హైదరాబాద్, వెలుగు: సీబీఎస్ఈ రిజల్ట్స్ లో తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సొసైటీ ( టీజీఈఎంఆర్ ఎస్ ) స్టూడెంట్లు సత్తా చాటారు. మొత్తం 1,294 మంది పరీక్ష రాయగా 1,293 మంది ( 99.92 శాతం) పాస్ అయ్యారని ఎస్టీ గురుకుల సెక్రటరీ సీతాలక్ష్మి బుధవారం పత్రిక ప్రకటనలో వెల్లడించారు. రాష్ర్టంలో మొత్తం 23 స్కూళ్లు ఉండగా 22 స్కూళ్లలో వంద శాతం పాస్ అయ్యారని ఆమె తెలిపారు. ముగ్గురు స్టూడెంట్లకు అత్యధిక మార్కులు వచ్చాయని చెప్పారు.

మొత్తం 700 మార్కులకు శంకర్ కు 660, రంజిత్ కు 647,  చైతన్య రాథోడ్ కు 635 మార్కులు వచ్చాయని సెక్రటరీ పేర్కొన్నారు. ఇక ఎ–1 గ్రేడ్ ఇద్దరికి, ఎ–2 గ్రేడ్ 30 మందికి, బీ–1 గ్రేడ్169 మందికి, బీ–2 గ్రేడ్ 368 మందికి, సీ–1 గ్రేడ్ 541 మందికి, సీ–2 గ్రేడ్182 మందికి, డీ–1 గ్రేడ్ ఇద్దరికి వచ్చాయని వివరించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన స్టూడెంట్లను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్క, ట్రైబల్ శాఖ సెక్రటరీ శరత్ లు అభినందించారు.