కేసీఆర్​తో విష్ణువర్ధన్​ రెడ్డి భేటీ

కేసీఆర్​తో విష్ణువర్ధన్​ రెడ్డి భేటీ

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్​తో పీజేఆర్​తనయుడు విష్ణువర్ధన్​రెడ్డి భేటీ అయ్యారు. ఆదివారం ప్రగతిభవన్​లో ఆయన సీఎంతో సమావేశమయ్యారు. కాంగ్రెస్​ పార్టీ రెండ్రోజుల కింద ప్రకటించిన సెకండ్​లిస్ట్​లో విష్ణువర్ధన్​రెడ్డికి చోటు దక్కలేదు. ఆయన​జూబ్లీహిల్స్​టికెట్ ఆశించగా, అది మహ్మద్​అజారుద్దీన్​కు కేటాయించారు.

 ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్ అనుచరులు శనివారం గాంధీభవన్​లో ఆందోళన నిర్వహించారు. విష్ణువర్ధన్​తో బీజేపీ నేతలు సంప్రదింపులు జరపగా, ఇప్పుడాయన సీఎం కేసీఆర్​తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.