V6 News

సమ్మె విరమించుకున్న విద్యుత్ శాఖ ఉద్యోగులు...డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు..

సమ్మె విరమించుకున్న విద్యుత్ శాఖ ఉద్యోగులు...డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు..

గత కొద్దిరోజులుగా సమ్మె బాట పట్టిన విద్యుత్ శాఖ ఆర్టిజన్లు సమ్మె విరమించుకున్నారు. ట్రాన్స్కో సీఎండీతో ఆర్టిజన్ల సమస్యలు చర్చించేందుకు డిప్యూటీ సీఎం ఆదేశించిన క్రమంలో సమ్మె విరమించాలని నిర్ణయించినట్లు తెలిపారు ఉద్యోగులు. శుక్రవారం ( ఏప్రిల్ 17 ) విద్యుత్ ఉద్యోగులతో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారని.. ఉన్నతాధికారులతో చర్చలకు అనుమతించారని తెలిపారు.

ప్రజలను మెప్పించే పనులు చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి

ఉద్యోగులు ప్రజలను మెప్పించే పనులు చేయాలని.. సమ్మెపై బ్యాన్ ఉన్నదని తెలిసి, వేసవిలో విద్యుత్తు డిమాండ్ పీక్ స్థాయిలో ఉంటుంది ఈ సమయంలో అకస్మాత్తుగా సమ్మెకు వెళ్లడం సరైనది కాదని అన్నారు భట్టి. చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం జరుగుతుందని అన్నారు. ఆర్టిజన్ల సమస్యలపై మానవీయ కోణంలో ప్రజా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అన్నారు భట్టి. విద్యుత్ సంఘాల నేతలు ఎప్పుడు వచ్చినా ప్రభుత్వం చర్చలు చేస్తుందని... వారి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు పోతుందని అన్నారు.

ఆర్థిక భారం లేకుండా మానవీయ కోణంలో పరిష్కరించగలిగే సమస్యలపై ఆర్టిజన్ల జేఏసీతో ట్రాన్స్కో సిఎండి చర్చలు జరుపుతారని.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు భట్టి. 

►ALSO READ | విద్య, వైద్యం కోసం ఎక్కువగా అప్పులు చేస్తున్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వారే !