- బదిలీలు ఆపాలని విద్యుత్ ఉద్యోగుల ధర్నా
పంజాగుట్ట, వెలుగు: తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలో జరుగుతున్న బదిలీలను వెంటనే నిలిపివేయాలని, బదిలీ కాలపరిమితిని 2 ఏండ్ల నుంచి 3 ఏండ్లకు పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ ఉద్యోగులు బుధవారం మింట్ కంపౌండ్‌లో భారీ ధర్నా నిర్వహించారు. టీఈఈ జేఏసీ, టీజీపీఈ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాకు సుమారు 10 వేలకు పైగా ఉద్యోగులు తరలిరావడంతో మింట్ కంపౌండ్ పూర్తిగా దిగ్బంధమైంది.
జేఏసీ నాయకులు సాయిబాబ, జాన్సన్, కన్వీనర్లు రత్నాకర్, శివాజీ, అంజయ్య, శ్యామ్ మనోహర్ మాట్లాడుతూ.. బదిలీ నిబంధనలను ఉద్యోగులకు తెలియకుండా మార్చి యాజమాన్యం ఇష్టారీతిన బదిలీలు చేస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. యాజమాన్యాలు ఇప్పటికైనా స్పందించి బదిలీలు నిలిపివేయాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
