రెవెన్యూ సిబ్బంది ప్రజలతో మమేకం కావాలి: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వి. లచ్చిరెడ్డి

రెవెన్యూ సిబ్బంది ప్రజలతో మమేకం కావాలి: తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వి. లచ్చిరెడ్డి
  • భూసమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలి
  • కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జీపీవోలతో ముఖాముఖి కార్యక్రమం

కరీంనగర్, వెలుగు : గ్రామాల్లో కొత్తగా నియామకమైన గ్రామ పరిపాలన అధికారులు (జీపీఓ) ప్రజలతో మమేకమై పనిచేస్తూ, రెవెన్యూ శాఖపై ఉన్న మచ్చను తొలగించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వి. లచ్చిరెడ్డి సూచించారు. గ్రామంలో అన్ని శాఖలను సమన్వయం చేయాల్సిన బాధ్యత జీపీఓలదేనని,  ప్రభుత్వం పెట్టిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చాలన్నారు. ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో కొత్తగా నియమితులైన జీపీఓలతో  కరీంనగర్ రెవెన్యూ గార్డెన్స్ లో బుధవారం నిర్వహించిన  ముఖాముఖి కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై జీపీవోలకు భూభారతి చట్టంపై అవగాహన, విధులు, బాధ్యతలపై దిశానిర్దేశం చేశారు. 

ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ గ్రామీణ రైతాంగానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న సంకల్పంతో పాటు గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేయడంలో భాగంగా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సహకారంతో జీపీఓ వ్యవస్థ ఏర్పాటు సాధ్యమైందన్నారు. జీపీవోల సమస్యలను తనకు వదిలేసి.. ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపాలని సూచించారు. తెలంగాణలోని ప్రతి గ్రామాన్ని రెవెన్యూ, భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఏ ఒక్కరు తప్పు చేసినా అది మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు తెస్తుందన్నారు. 

తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్ (టీజీఆర్ఎస్ఏ) రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి మాట్లాడుతూ.. కారుణ్య నియామకాలకు సంబంధించి త్వరలోనే తీపి కబురు వస్తుందని తెలిపారు. పదోన్నతుల విషయంలో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

కార్యక్రమంలో టీజీటీఏ జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాక, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, రాష్ట్ర అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు చిల్లా శ్రీనివాస్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టీజీటీఏ కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నగర కార్యదర్శి రాజేశ్వరి, నవాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షరీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రిటైర్డ్ తహసీల్దార్ గంప శంకరయ్య, మల్లారం అర్జున్, ఆంజనేయ ప్రసాద్, సాయి కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. అనంతరం రెవెన్యూ సంఘాల ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడారు.