ముషీరాబాద్, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయాలని, ఆ దిశగా ఉద్యోగులంతా ముందుండాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి కోరారు. గ్రామ పాలన ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగులు పని చేస్తూనే సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని సూచించారు.
అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా గరిక ఉపేందర్ రావు, మహిళా అధ్యక్షురాలిగా కంది శిరీషరెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా అర్జున్ మల్లారం, ఆర్.విజయ్ కుమార్, కోశాధికారిగా ఇంజమూరి ఈశ్వర్, సెక్రటరీగా బి.లక్ష్మీనరసింహులు, దాసరి వీరప్ప, అసోసియేట్ అధ్యక్షులుగా కారమూరి చంద్రయ్య, చిరంజీవి ఎన్నికయ్యారు.
