V6 News

కొత్త ఆలోచనలకు పదును పెట్టాలి:హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

కొత్త ఆలోచనలకు పదును పెట్టాలి:హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
  • ఇంజినీర్​ అవార్డుల ప్రదానోత్సవంలో  హైడ్రా కమిషనర్​ ఏవీ రంగనాథ్​

హైదరాబాద్ సిటీ,వెలుగు: చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి ఇంజినీర్లతో సాధ్యమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. తెలంగాణ ఇరిగేషన్ డే సందర్భంగా  శుక్రవారం ది ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్​లో  ఇంజినీర్స్ అవార్డులను ప్రదానం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ట్రాఫిక్, సీవరేజ్​ సమస్యల పరిష్కారంలో పద్ధతులు వదిలేయాలని, టెక్నాలజీని సాయంతో కొత్త పరిష్కార మార్గాలు వెతకాలన్నారు. ఇంజినీర్లు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆలోచనలకు పదును పెట్టాలని సూచించారు. ఇరిగేషన్ డే సందర్భంగా ఇంజినీర్లను అవార్డులతో సత్కరించుకోవడం సంతోషంగా ఉందని ఐఈఐ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ రమణ నాయక్ తెలిపారు.