బీటెక్, పీజీ చేశారా ? డీఆర్డీఓలో ఉద్యోగాలు.. రూపాయి ఫీజు, పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్..

బీటెక్, పీజీ చేశారా ? డీఆర్డీఓలో ఉద్యోగాలు.. రూపాయి ఫీజు, పరీక్ష లేకుండా డైరెక్ట్  జాబ్..

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్​మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్​డీఓ) సైంటిఫిక్ అనాలసిస్ గ్రూప్ (ఎస్ఏజీ) జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టు పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.

మొత్తం ఖాళీలు: 11.

విభాగాల వారీగా ఖాళీలు: మ్యాథమెటిక్స్ 3, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ/ కంప్యూటర్ సైన్స్ (సీఎస్) 4, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈ)/ ఎలక్ట్రానిక్స్ & కమ్యునికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) 3, ఫిజిక్స్ 1. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితోపాటు నెట్ లేదా గేట్ స్కోర్ తప్పనిసరి. లేదా సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెండింటిలోనూ ఫస్ట్‌‌ క్లాస్ మార్కులతో ఎంఈ/ ఎం.టెక్ పూర్తిచేసి ఉండాలి.

అభ్యర్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాల్లో ఫస్ట్‌‌ క్లాస్ మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు నెట్ అర్హత సాధించి ఉండటం తప్పనిసరి.

గరిష్ట వయోపరిమితి: 35 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. 

ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. 

వాక్​ఇన్ ఇంటర్వ్యూ: ఆగస్టు 5.

సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ drdo.gov.inను సందర్శించండి.