ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్‌‌.. పెళ్లి కాని వారికి ఛాన్స్.. ఫీజు లేదు, శిక్షణలో రూ.56 వేల స్టైపెండ్..

ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్‌‌.. పెళ్లి కాని వారికి ఛాన్స్.. ఫీజు లేదు, శిక్షణలో రూ.56 వేల స్టైపెండ్..

దేశ రక్షణ రంగంలో పనిచేయాలనుకునే ఇంజినీరింగ్ అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. 2027, ఏప్రిల్‌‌లో ప్రారంభం కానున్న 68వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్) మెన్ కోర్స్ నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 350 లెఫ్టినెంట్ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన విభాగాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన లేదా చివరి సంవత్సరం చదువుతున్న అవివాహిత పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అర్హత గల అభ్యర్థులు జులై 09 నుంచి ఆగస్టు 07 వరకు ఆన్‌‌లైన్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ‘లెఫ్టినెంట్’ హోదాతోపాటు మగధ్ యూనివర్సిటీ నుంచి పీజీ డిప్లొమా డిగ్రీ లభిస్తుంది.

పోస్టు పేరు: షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్నికల్)
ఎస్ఎస్​సీ(టీ)–68 పురుషులు. 

మొత్తం ఖాళీలు: 350. 
విభాగాల వారీగా ఖాళీలు: సివిల్ 75, కంప్యూటర్ సైన్స్ 60, ఎలక్ట్రికల్ 33, ఎలక్ట్రానిక్స్ 64, మెకానికల్ 101, ఇతర ఇంజినీరింగ్ స్ట్రీమ్స్ 17. 

వైవాహిక స్థితి: కేవలం అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ)లో పూర్తి స్థాయి శిక్షణ ముగిసే వరకు అభ్యర్థులు వివాహం చేసుకోకూడదు. శిక్షణలో చేరడానికి ముందు లేదా శిక్షణ సమయంలో వివాహం చేసుకుంటే సదరు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయడంతోపాటు వారిని విధుల నుంచి తొలగిస్తారు.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2027, మార్చి 29 తర్వాత చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ ఫలితాలు వెల్లడయ్యే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు.

వయోపరిమితి: 2027, ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. అంటే అభ్యర్థులు 2000, ఏప్రిల్ 1 నుంచి 2007, మార్చి 31 మధ్యలో జన్మించి ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జులై 9. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.

లాస్ట్ డేట్: ఆగస్టు 7. 

షార్ట్​లిస్టింగ్ కటాఫ్:  అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కటాఫ్ మార్కుల వివరాలను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తారు.

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఎస్ఎస్​బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.joinindianarmy.nic.inను సందర్శించండి. 

ఎస్‌‌ఎస్‌‌బీ ఇంటర్వ్యూ: ఎస్‌‌ఎస్‌‌బీ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. స్టేజ్–-1లో ఉత్తీర్ణులైన వారిని మాత్రమే స్టేజ్--–2కు అనుమతిస్తారు. మొదటి దశలో అర్హత సాధించని అభ్యర్థులను అదేరోజు తిరిగి పంపించివేస్తారు. ఎస్‌‌ఎస్‌‌బీ ఇంటర్వ్యూలు ఐదు రోజులపాటు జరుగుతాయి. 2026, అక్టోబర్–- డిసెంబర్  నెలల మధ్య నిర్వహించే అవకాశం ఉన్నది.

సెలెక్షన్ సెంటర్స్: షార్ట్​లిస్ట్ చేసిన అభ్యర్థులకు ప్రయాగ్‌‌రాజ్ (ఉత్తరప్రదేశ్), భోపాల్ (మధ్యప్రదేశ్), బెంగళూరు (కర్ణాటక), జలంధర్ (పంజాబ్)ల్లోని ఏదో ఒక సెలెక్షన్ సెంటర్‌‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. 

కోర్స్ ప్రారంభం: 2027, ఏప్రిల్. 

శిక్షణా కాలం: 2027, ఏప్రిల్ నుంచి 2028, మార్చి వరకు (49 వారాలు). శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు బోధ్‌‌గయలోని మగధ్ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మిలిటరీ స్టడీస్ & డిఫెన్స్ మేనేజ్‌‌మెంట్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.

శిక్షణా కాలంలో స్టైపెండ్: నెలకు రూ. 56,100ల స్టైపెండ్ చెల్లిస్తారు. 

కమిషనింగ్ హోదా: ప్రొబేషన్‌‌పై అభ్యర్థులకు లెఫ్టినెంట్ హోదాతో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్​సీ) కేటాయిస్తారు.

కనీస సేవా కాలం: 10 సంవత్సరాలు.

గరిష్ట సేవా కాలం: అర్హతను బట్టి 10 సంవత్సరాల తర్వాత మరో 4 ఏళ్ల పాటు పొడిగింపు అవకాశంతో గరిష్టంగా 14 సంవత్సరాల వరకు సేవలు అందించవచ్చు.

పర్మనెంట్ కమిషన్ ఆప్షన్: అభ్యర్థి అర్హత, సామర్థ్యం, అప్పటి నిబంధనల ఆధారంగా.. వారి 10  సంవత్సరాల సర్వీసులో పర్మనెంట్ కమిషన్ కల్పించే అంశాన్ని పరిశీలిస్తారు.

►ALSO READ | బీటెక్ అర్హతతో ఆర్మీలో ఉద్యోగాలు... జీతం రూ. 55 వేలు పైనే....