
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (ఈఆర్‌ఎస్‌ఎస్) డయల్ సత్ఫలితాలను ఇస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో కాల్‌చేయాల్సిన టోల్‌ఫ్రీ సర్వీసెస్ నంబర్లు డయల్100, ఫైర్ సర్వీసెస్, అంబులెన్స్ సహా మహిళా భద్రతకు సంబంధించి 181, చైల్డ్‌సేఫ్టీ 1098, విపత్తులకు సంబంధించిన 1077 టోల్‌ఫ్రీ నంబర్లు టీజీ ఈఆర్‌ఎస్‌ఎస్‌కు అనుసంధానం చేశారు. దీని ద్వారా ఎమర్జెన్సీ సర్వీస్ నంబర్లలో దేనికి కాల్‌చేసినా.. ఆటోమెటిక్‌గా టీజీఆర్‌ఎస్‌ఎస్ డయల్112కు కనెక్ట్ అవుతుంది.
వాయిస్ కాల్స్, ఎస్‌ఎమ్‌ఎస్, ఇ మెయిల్స్, ఫోన్లలోని ఎస్‌ఓఎస్ ప్రెస్ చేసినా 112కి కాల్‌వెళ్తుంది. ఇలా గత ఆరు నెలల వ్యవధిలో వచ్చిన కాల్స్‌ఆధారంగా 45 అత్యవసర సేవలు అందించి అనేక మంది ప్రాణాలు కాపాడినట్టు ఐసీసీసీ డైరెక్టర్‌విబి కమలాసన్ రెడ్డి వెల్లడించారు.