హైదరాబాద్: హెచ్ఆర్ రిక్రూట్‌మెంట్, ట్యాలెంట్ మేనేజ్‌మెంట్ రంగాలలో అందించిన విశేష సేవలకు గానూ 'వేతన హ్యూమన్ క్యాపిటల్ కన్సల్టింగ్' ఫౌండర్ అయినంపూడి శ్రీ పల్లవి ప్రతిష్టాత్మక 'తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డు 2026' పురస్కారాన్ని అందుకున్నారు.
నేషనల్ ఎక్సలెన్స్ కౌన్సిల్ నేతృత్వంలో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో కేఫ్ నిలోఫర్ చైర్మన్ బాబూరావు, ప్రముఖ సినీ నటి హెబ్బా పటేల్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు.
హెచ్ఆర్ కార్యకలాపాలను ఆధునీకరించడం, సమర్థవంతమైన టీమ్స్‌ను తయారు చేయడం, వర్క్‌ఫోర్స్ ట్రాన్స్‌ఫార్మేషన్ ద్వారా వ్యాపారాలు స్థిరమైన వృద్ధిని సాధించేలా చేయడంలో పల్లవి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
