V6 News

కల్వకుంట్ల కుటుంబ పాలనలో  తెలంగాణ ఆగం :  మానిక్​ రావు ఠాక్రే

కల్వకుంట్ల కుటుంబ పాలనలో  తెలంగాణ ఆగం :  మానిక్​ రావు ఠాక్రే

అచ్చంపేట, వెలుగు: అమరవీరుల  త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ  కల్వకుంట్ల కుటుంబ దోపిడీ పాలనతో ఆగమవుతోందని కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మానిక్​రావు  ఠాక్రే ఆరోపించారు.  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శనివారం సాయంత్రం అచ్చంపేటకు చేరుకున్న సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు  డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో  సుమారు పదివేల మందితో  స్వాగతం పలికారు.

 ఈ పాదయాత్రలో  ఠాక్రే మాట్లాడుతూ..  రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర తర్వాత భట్టి చేస్తున్న యాత్ర  మరో భారత్​ జోడో యాత్రగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో  తమిళనాడు సీఎల్పీ నేత సెల్వా పెర్తుంగై, ఏఐసీసీ సెక్రెటరీ సిరివెళ్ల ప్రసాద్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు  మల్లు రవి, వీహెచ్​,  బెల్లయ్య నాయక్, శివసేనారెడ్డి , మల్లురవి, నాగం జనార్దన్​ రెడ్డి, మధుసూదన్​ రెడ్డి,  శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.