తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. జూన్ 2న హైదరాబాద్లో ట్రాఫిక్ డైవర్షన్స్.. ఈ రూట్లలో అనుమతిలేదు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. జూన్ 2న హైదరాబాద్లో  ట్రాఫిక్ డైవర్షన్స్.. ఈ రూట్లలో అనుమతిలేదు

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది ప్రభుత్వం. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు జరుగుతాయి. అందులో భాగంగా కొన్ని ఏరియాల్లో రోడ్లను బ్లా్క్ చేయడంతో పాటు ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండనున్నాయి. ఆ రోజు ఉండబోయే నిబంధనలు, ట్రాఫిక్ మళ్లింపు మొదలైన అంశాలపై గైడ్ లైన్స్ విడుదల చేసింది హైదరాబాద్ పోలీసు శాఖ. జూన్ 2న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గన్ పార్క్, పరేడ్ గ్రౌండ్స్ రూట్లలో డైవర్షన్ ఉంటుందని చెప్పారు. 

సైఫాబాద్ ద్వారక హోటల్ నుంచి వచ్చే వాహనాలను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్ వరకు రాకుండా.. రవీంద్ర భారతి వద్ద ఇక్భాల్ మినార్ జంక్షన్ రూట్ లో డైవర్ట్ చేయనున్నారు. అదే విధంగా నాంపల్లి T జంక్షన్ నుంచి వచ్చే ట్రాఫిక్ రంవీంద్ర భారతి  వైపు వెళ్లకుండా ఏఆర్ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి బీజేఆర్ స్టాచూ వైపు మళ్లిస్తారు. దీంతో రవీంద్ర భారతి, ఏఆర్ పెట్రోల్ పంప్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్ ల వద్ద ట్రాఫిక్ ఉండే అవకాశం ఉంది. 

వాహనదారులు పంజాగుట్ట నుంచి గ్రీన్ లాండ్స్, బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ రూట్లను అవాయిడ్ చేయాలని సూచించారు. పరేడ్ గ్రౌండ్స్ లో ఆవిర్భావ వేడుకలు ఉన్నందున ఆ రూట్లలో రావద్దని సూచించారు. టివోలీ ఎక్స్ రోడ్, ప్లాజా ఎక్స్ రోడ్లను కంప్లీట్ గా మూసేస్తున్నట్లు చెప్పారు. 

ట్రాఫిక్ డైవర్షన్స్ పూర్తి వివరాలు :

  •  బేగంపేట నుంచి సంగీత్ ఎక్స్ రోడ్ల వైపు వచ్చే ట్రాఫిక్‌ను CTO X రోడ్ల వద్ద బాలమ్రాయ్, బ్రూక్ బాండ్, టివోలి, స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ మీదుగా సంగీత్ ఎక్స్ రోడ్ల వైపు మళ్లిస్తారు.
  • బోయిన్‌పల్లి, తాడ్‌బండ్, టివోలి నుంచి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్‌ను టివోలి, స్వీకార్ ఉపకార్, వైఎంసీఏ, సెయింట్ జాన్స్ రోటరీ మీదుగా డైవర్ట్ చేస్తారు.
  • సంగీత్ ఎక్స్ రోడ్ నుంచి బేగంపేట వైపు వచ్చే ట్రాఫిక్‌ను వైఎంసీఏ వద్ద క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్, సిటిఓ, రసూల్‌పురా వైపు మళ్లిస్తారు.
  • అలుగడ్డబాయి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సంగీత్ ఎక్స్ రోడ్ల వద్ద క్లాక్ టవర్, ప్యాట్నీ, ప్యారడైజ్ వైపు మళ్లిస్తారు.
  • బోయిన్‌పల్లి, తాడ్‌బండ్ నుండి టివోలి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను బ్రూక్ బాండ్ వద్ద CTO, రాణిగంజ్, ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తారు.
  • హైదరాబాద్ RTA తిరుమలగిరి, కార్ఖానా నుంచి ప్లాజా వైపు వచ్చే ట్రాఫిక్‌ను టివోలి వద్ద స్వీకార్ ఉపకార్, YMCA లేదా బ్రూక్ బాండ్, బాలమ్రాయ్, CTO వైపు మళ్లిస్తారు. 

ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్స్ ఇవే:

ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తుండటంతో చాలా చోట్ల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా చిలకల్‌గూడ ఎక్స్ రోడ్, అలుగడ్డబాయి ఎక్స్ రోడ్ల, సంగీత్ ఎక్స్ రోడ్, వైఎంసిఎ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, ఎస్‌బిహెచ్ ఎక్స్ రోడ్, ప్లాజా, సిటిఓ జంక్షన్, బ్రూక్ బాండ్ జంక్షన్, టివోలి జంక్షన్, స్వీకర్ ఉపకార్ జంక్షన్, సికింద్రాబాద్ క్లబ్, త్రిముల్‌ఘేరీ ఎక్స్ రోడ్లు, తాడ్‌బండ్ ఎక్స్ రోడ్లు, సెంటర్ పాయింట్, డైమండ్ పాయింట్, బోవెన్‌పల్లి ఎక్స్ రోడ్లు, రసూల్‌పురా, బేగంపేట, ప్యారడైజ్ ఉన్నాయి.

హైదరాబాద్ వాసులందరూ ఈ డైవర్షన్స్ ను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు పోలీసులు.  ట్రాఫిక్ అప్ డేట్స్ కోసంfacebook.com/HYDTP,  Twitter: @HYDP ద్వారా సెర్చ్ చేయవచ్చు. హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 .