ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజన్నారు. బీజేపీ ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తోందని ధ్వజమెత్తారు. హేమంత్ సోరెన్ , కవిత ఘటనలే ఇందుకు నిదర్శనమన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటుందని మండిపడ్డారు.బీజేపీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ అన్నారు. అక్రమంగా పెట్టిన కేసులను వెనక్కి తీసుకుని అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ చర్యలను బీఆర్ఎస్ ఖండిస్తుందన్నారు కేసీఆర్.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ ను ఈడీ నిన్న అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ ను 10 రోజుల కస్టడీ ఇవ్వాలంటూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అలాగే మార్చి 15న అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు ఈడీ వారం రోజుల కస్టడీ విధించిన సంగతి తెలిసిందే..
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారి అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్యవహరిస్తున్నదని ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్… pic.twitter.com/UCVs3DX2Pd
— BRS Party (@BRSparty) March 22, 2024
