మూసీ వెంట కొత్త సర్వీస్ రోడ్డు..2.19 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వ అనుమతి

మూసీ వెంట కొత్త సర్వీస్ రోడ్డు..2.19 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వ అనుమతి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్​ఔటర్​ రింగ్​ రోడ్డును ఆనుకొని మూసీ నది వెంట కొత్త సర్వీస్​ రోడ్డు నిర్మించడానికి అవసరమైన భూ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మంచిరేవుల గ్రామానికి చెందిన 2.19 ఎకరాల భూమి సేకరించాలని సోమవారం మున్సిపల్​ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్​ రంజన్​ జీవో జారీ చేశారు.  ఓఆర్​ఆర్​ ఎగ్జిట్​ 18 ఏ నుంచి నార్సింగి వరకు సర్వీస్​ రోడ్డు నిర్మించాల్సి ఉంది.

కానీ గతంలో జారీ చేసిన జీవో 120  ప్రకారం ఈ భూమి నార్సింగిలో ఉందని పేర్కొనగా తాజాగా జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఈ భూమి గండిపేట్​ మండలం మంచిరేవులది  చెందినదిగా పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ భూసేకరణ అంత్యంత అవసరమని గుర్తించిన ప్రభుత్వం పాత జీవోను రద్దు చేసి కొత్త జీవో జారీ చేశారు. భూమి విస్తీర్ణం మార్చకుండా కేవలం గ్రామం పేరు మాత్రమే సరిచేస్తూ ఉత్తర్వలు జారీ చేశారు.