హైదరాబాద్, వెలుగు: తమ డిమాండ్ల సాధన కోసం ఇటీవల సమ్మె చేసిన ఆర్టిజన్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నెల 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆర్టిజన్లు చేపట్టిన సమ్మె కాలాన్ని ‘సెలవు దినాలు’ గా గుర్తిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. గత నెల18న యూనియన్ ప్రతినిధులు జెన్ కో యాజమాన్యానికి దరఖాస్తు చేసుకున్నారు.
యూనియన్ల విన్నపంపై స్పందించిన జెన్ కో హెచ్ఆర్ డైరెక్టర్ ఎస్.వి. కుమార్ రాజు సమ్మె కాలాన్ని సెలవు దినాలుగా గుర్తిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని విద్యుత్ సంస్థల సీఈలు, ఎస్ఈలు వీటిని అమలు చేయాలని ఆదేశించారు.
