అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపు .. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల  రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంపు .. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతూ మహిళ, స్ర్తీ సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రాంచంద్రన్ శనివారం జీవో నంబర్ 8ని జారీ చేశారు. కొత్త ఉత్తర్వుల ప్రకారం అంగన్వాడీ టీచర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.లక్ష నుంచి రూ. 2 లక్షలకు , హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెరగనున్నాయి. 

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు ఉండగా, 60 ఏండ్లు దాటి వీఆర్‌‌ఎస్ తీసుకునే టీచర్లు, హెల్పర్లకు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తిస్తాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.