ఏపీ అక్రమ ప్రాజెక్టులపై రెండేండ్లుగా సర్కార్ నిర్లక్ష్యం

ఏపీ అక్రమ ప్రాజెక్టులపై రెండేండ్లుగా సర్కార్ నిర్లక్ష్యం

2019 

  • ఆగస్టు 12: రాయలసీమను రతనాల సీమగా మారుస్త. జగన్​కు పెద్దన్నగా కష్టాలు తీర్చడంలో నా ఆశీస్సులు, సహకారం ఉంటాయి. ఇది కొందరికి అర్థం కాకపోవచ్చు.. మరికొందరికి అజీర్తా చేయొచ్చు: నగరిలో ఎమ్మెల్యే రోజా ఇంట్లో కేసీఆర్​ కామెంట్లు 
  • నవంబర్‌‌‌‌‌‌‌‌ 18: కృష్ణాపై ఏపీ కొత్త లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ శీర్షికన ‘వీ6 - వెలుగు’ మొదటి కథనం
  • డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 12: ‘వెలుగు’ కథనాల ఆధారంగా పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ పనులు ఆపాలని కృష్ణా బోర్డు (కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ)కు తెలంగాణ ఈఎన్సీ కంప్లైంట్‌‌‌‌‌‌‌‌
  • డిసెంబర్ 13: పోతిరెడ్డిపాడు విస్తరణకు జగన్ ప్లాన్.. తెలంగాణకు నష్టంపై ‘వీ6-వెలుగు’ కథనాలు

 

2020 

  • మే 5: సంగమేశ్వరం (రాయలసీమ) లిఫ్ట్‌‌‌‌‌‌‌‌, పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌ విస్తరణ కోసం ఏపీ ప్రభుత్వం జీవో నం. 203 జారీ.. రూ.6,820 కోట్లతో పనులు చేపట్టేందుకు పరిపాలన అనుమతి
  • మే 6: సంగమేశ్వరం ఎత్తిపోతలు, పోతిరెడ్డిపాడు విస్తరణతో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని చెప్తూ ‘వీ6– వెలుగు’ కథనాలు
  • మే 12: పోతిరెడ్డిపాడు విస్తరణ, సంగమేశ్వరం ప్రాజెక్టులపై కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీ చైర్మన్‌‌‌‌‌‌‌‌కు ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ ఫిర్యాదు
  • మే 21: ఏపీ అక్రమ ప్రాజెక్టుల ప్లాన్ పై  ఎన్జీటీలో రైతు గవినోళ్ల శ్రీనివాస్ పిటిషన్.  వెంటనే  స్టే ఆదేశాలు జారీ చేసిన ఎన్జీటీ
  • జూన్‌‌‌‌‌‌‌‌ 3: ‘వీ6– వెలుగు’ వరుస కథనాలతో మరోసారి కృష్ణా బోర్డుకు  ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ కంప్లైంట్‌‌‌‌‌‌‌‌
  • ఆగస్టు 5: కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై మీటింగ్ సాకుతో అపెక్స్ కౌన్సిల్ భేటీని వాయిదా వేయించిన సీఎం కేసీఆర్
  • ఆగస్టు 19: సంగమేశ్వరం టెండర్ల ప్రాసెస్ పూర్తిచేసిన జగన్ సర్కారు
  • ఆగస్టు 21: ఎన్జీటీలో రైతు గవినోళ్ల శ్రీనివాస్​ పిటిషన్ పై తీర్పు రావాల్సిన రోజే కేసీఆర్ సర్కారు రీఓపెన్ పిటిషన్ ఫైల్ చేసింది. దీంతో తీర్పు వాయిదా పడింది.
  • అక్టోబర్ 6: కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షతన అపెక్స్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ సమావేశం.. ఉమ్మడి ఏపీలో తెలంగాణ కు జరిగిన నష్టంపైనే ఎక్కువగా ఫోకస్‌‌‌‌‌‌‌‌ చేసిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌.. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై అనుకున్న స్థాయిలో చెప్పని సీఎం
  • అక్టోబర్ 29: ఏపీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు తీసుకోవాల్సిందేనని ఎన్జీటీ  తీర్పు.. రాష్ట్ర సర్కారు పిటిషన్ వల్లే రెండు నెలలు లేటుగా తీర్పు
  • డిసెంబర్ 13: సంగమేశ్వరం దగ్గర అక్రమంగా పనులు సాగుతున్నయని విజువల్స్, ఫొటోలతో ‘వీ6–వెలుగు’ స్టోరీలు
  • డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 19: సంగమేశ్వరం పనులపై కృష్ణా బోర్డుకు ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఈఎన్సీ ఫిర్యాదు
  • డిసెంబర్ 22: ఎన్జీటీ  తీర్పును ఏపీ ధిక్కరించినట్లు గవినోళ్ల శ్రీనివాస్ పిటి షన్. దీనిపై పిటిషనే వేయని సర్కారు.

2021 

  •     మార్చి 20: సంగమేశ్వరంపై కేఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీకి రాష్ట్ర ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ఈఎన్సీ ఫిర్యాదు
  •     జూన్‌‌‌‌‌‌‌‌ 9: కృష్ణా రివర్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బోర్డుకు రాష్ట్ర ఈఎన్సీ కంప్లైంట్‌‌‌‌‌‌‌‌
  •     జూన్  24: ఆరునెలల ముందే ‘వీ6– -వెలుగు’లో ఫొటోలు, విజువల్స్ వచ్చినా సంగమేశ్వరంలో పనుల ఫొటోలే దొరకలేదన్న మంత్రి ప్రశాంత్​రెడ్డి
  •     జూన్  25: సంగమేశ్వరం పనులు చేస్తున్నట్లు ఈ మధ్యే తెలిసిందన్న మంత్రి జగదీశ్ రెడ్డి
  •     జూన్  25: గవినోళ్ల శ్రీనివాస్​ పిటిషన్ ఆధారంగా ఎన్జీటీ  విచారణ, పనులు జరుగుతున్నట్లు తేలితే ఏపీ సీఎస్‌‌‌‌‌‌‌‌ను జైలుకు పంపిస్తామని వార్నింగ్
  •     జూన్  26: ఏడాదిన్నర పాటు సోయిలేనట్లుగా ఉన్న రాష్ట్ర మంత్రుల వరుస  ప్రెస్ మీట్లు.. వీధిపోరాటాలు చేస్తాం, మానవబాంబులు అవుతాం అంటూ జనాన్ని      రెచ్చగొట్టే మాటలు