
హైదరాబాద్, వెలుగు: ఎనిమిది జిల్లాలకు కొత్త కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మొత్తం 14 మంది ఐఏఎస్‌లను ట్రాన్స్ఫర్ చేసింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్‌కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్‌పీఎస్సీ సెక్రటరీగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనితా రామచంద్రన్‌ను నియమించారు. కామారెడ్డి కలెక్టర్ శరత్‌ను పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ డిపార్ట్మెంట్కు కమిషనర్‌గా ఉన్న రఘునందన్‌రావును అగ్రికల్చర్ కమిషనర్‌గా ట్రాన్స్ఫర్ చేశారు. రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్‌ను ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న డాక్టర్ వి.వెంకటేశ్వర్లును యూత్ సర్వీసెస్ డైరెక్టర్‌గా, మహమ్మద్ అబ్దుల్ అజీమ్‌ను మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ సెక్రటరీగా నియమించారు.