ఉప్పల్ భూముల అమ్మకానికి సిద్దమైన సర్కార్

ఉప్పల్ భూముల అమ్మకానికి సిద్దమైన సర్కార్

మరోసారి భూముల అమ్మకానికి సిద్దమైంది సర్కార్. ఇప్పటికే కోకాపేట, ఖానామెట్ భూముల వేలంతో 2 వేల కోట్లు  సేకరించిన ప్రభుత్వం.. మరోసారి HMDA భూములను బేరానికి పెట్టింది.  ఈసారి మాత్రం.. గత వేలంలో అమ్ముడు పోని ఉప్పల్ భగాయత్ ప్లాట్లను సేల్ చేస్తోంది. ఇందులో రెసిడెన్షియల్ తో పాటు కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి. వీటి అమ్మకంతో వెయ్యి కోట్లకు పైగా ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు అధికారులు.

దీపావళి పండగ వస్తే చాలు.. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ముందు పండగ బంపరాఫఫర్  ప్రకటనలు కనిపిస్తాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాలు, కొత్త బట్టలు కొనే వారిని ఆకర్షించడానికి ఈ బంపరాఫర్లు పెడతారు. అదే ఫార్మూలతో.. సర్కార్.. ఖజానా నింపుకుంటోంది. దీపావళి బంపరాఫర్ పేరుతో HMDAకు చెందిన ఉప్పల్ భగాయత్ భూముల అమ్మకానికి సిద్దమైంది.

ప్రతిసారి భూముల అమ్మకంతో కోట్ల రూపాయలను రాబడుతోంది సర్కార్. HMDA ల్యాండ్స్ అమ్మకంతో భారీగా ఆదాయాన్ని సేకరిస్తోంది. గత ఐదేండ్లలో HMDA నాలుగు సార్లు భూముల అమ్మకం ద్వారా 1400 కోట్ల రూపాయలు రాబట్టింది. ఉప్పల్ భగాయత్ ఫేజ్ వన్ లే-అవుట్ భూముల అమ్మకంతో 400 కోట్లు, తర్వాత ఫేజ్ టు, మియాపూర్, కూకట్ పల్లి భూములను రెండుసార్లు వేలం వేయడం ద్వారా దాదాపు వెయ్యి కోట్లను సేకరించింది. రీసెంట్ గా కోకాపేట, ఖానామెట్ ల్యాండ్స్ ఈ-వేలంతో సర్కార్ కి 2 వేల కోట్లు వచ్చాయి. మరోసారి ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లో మిగిలిన 44 ప్లాట్లను వేలం వేయడానికి రెడీ చేసింది HMDA.

ఈసారి వేసే ఈ-వేలంలో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్స్ ఉన్నాయి. 200 గజాల నుంచి 2 వేల గజాల దాకా.. ఉన్న ప్లాట్లను వేలం వేయనుంది HMDA. మొత్తం లక్షా 35 వేల గజాలను అమ్మనుంది. వీటి అమ్మకంతో సర్కార్ కు వెయ్యి కోట్లకు పైగా ఆదాయం వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు భావిస్తున్నారు. వేలంలో పాల్గోనేవారు MSTCలో.. రిజిస్ట్రేషన్, ఈఎండీ చెల్లింపునకు ఈనెల 30 చివరి తేదిగా ప్రకటించింది. వచ్చే నెల 2,3 తేదీల్లో ఉప్పల్ భగాయత్ ప్లాట్లకు ఆన్ లైన్ బిడ్డింగ్ కొనసాగనుంది.

HMDA గజానికి 35వేల రూపాయల ధరను నిర్ధారించింది. కనీసం బిడ్ పెంపునకు గజానికి వెయ్యి  రూపాయల చొప్పున పెంచాల్సి ఉంటుంది. 300, 500, 1000, 2000 గజాల ఫ్లాట్లుగా డివైడ్ చేశారు అధికారులు. గతంలో ఉప్పల్ భగాయత్ భూములు వేలం వేసినప్పుడు.. అత్యధికంగా గజానికి 82 వేల వరకు ధర పలికింది. ఈసారి కూడా మంచి రేట్ వస్తుందని HMDA భావిస్తోంది. దాదాపు వేయ్యి కోట్లను క్రాస్ చేస్తుందని అంచనా.మొత్తానికి సర్కార్..దీపావళి బంపర్ ఆఫర్ పేరుతో..HMDA దగ్గర మిగిలిన ప్లాట్లను వేలం వేసి డబ్బులు రాబడుతోంది ప్రభుత్వం