తొమ్మిది మంది ఎస్పీలు బదిలీ..ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

తొమ్మిది మంది ఎస్పీలు బదిలీ..ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది మంది నాన్‌‌ కేడర్‌‌ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌‌రాజ్‌‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి డీసీపీగా పనిచేస్తున్న పి. కరుణాకర్‌‌ను ఇంటెలిజెన్స్‌‌ ఎస్పీగా ట్రాన్స్‌‌ఫర్​చేశారు. 

హైదరాబాద్‌‌ సిటీ టాస్క్‌‌ఫోర్స్‌‌ డీసీపీ వైవీఎస్‌‌ సుధీంద్రను సైబరాబాద్‌‌ డీసీపీగా, సైబరాబాద్‌‌ డీసీపీ బీ సాయి శ్రీని టీజీ సైబర్‌‌ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీగా, ఏసీబీ జాయింట్‌‌ డైరెక్టర్‌‌ ఎస్‌‌వీఎన్‌‌ శివరామ్‌‌ను ఎస్పీ ఇంటెలిజెన్స్‌‌గా, టీజీ ట్రాన్స్‌‌కో ఎస్పీ ఆర్‌‌. జగదీశ్వర్‌‌రెడ్డిని ఎస్పీ ఇంటిలిజెన్స్‌‌గా బదిలీ చేశారు. 

రాచకొండ క్రైమ్స్‌‌ డీసీపీ వీ అరవింద్‌‌బాబును హైదరాబాద్‌‌ సిటీ సైబర్‌‌ క్రైమ్స్‌‌ డీసీపీగా, హైదరాబాద్‌‌ సిటీ సైబర్‌‌ క్రైమ్స్‌‌ డీసీపీ దార కవితను వరంగల్‌‌ సెంట్రల్‌‌ జోన్‌‌ డీసీపీగా, ఇంటెలిజెన్స్‌‌ ఎస్పీ ఎం. రవీందర్‌‌రెడ్డిని గ్రేహౌండ్స్‌‌ గ్రూప్‌‌ కమాండర్‌‌గా, హైడ్రా అడిషనల్‌‌ కమిషనర్‌‌ ఎన్‌‌. అశోక్‌‌కుమార్‌‌ను సీఐడీ ఎస్పీగా ట్రాన్స్‌‌ఫర్ ​చేశారు.