పులి పిల్లలను దత్తత తీసుకున్న తెలంగాణ గవర్నర్

పులి పిల్లలను దత్తత తీసుకున్న తెలంగాణ గవర్నర్

హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా రెండు పులి పిల్లలను దత్తత తీసుకున్నారు. 9 నెలల వయసు కలిగిన “ఇషాన్” అనే మగ పులి పిల్లతో పాటు “వన్యా” అనే ఆడ పులి పిల్లను గవర్నర్ దత్తత తీసుకున్నారు. ఈ రెండు పులి పిల్లలు 30 జూలై 2025న జన్మించాయి. వీటి తల్లిదండ్రులు ప్రభాస్, మాల అనే పులులు.

ఈ రెండు పులి పిల్లలకు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఇటీవలే నామకరణం చేయడం విశేషం. వన్యప్రాణుల సంరక్షణపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో గవర్నర్ ఈ దత్తత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూ అధికారులు గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.