ప్రధానికి గవర్నర్ శుభాకాంక్షలు

ప్రధానికి గవర్నర్ శుభాకాంక్షలు

హైదరాబాద్, వెలుగు: దేశ చరిత్రలో అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. ఇది ప్రధాని మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసానికి నిదర్శనమని గవర్నర్ కొనియాడారు. గత కొన్నేండ్లుగా దేశం ఆర్థికాభివృద్ధి, డిజిటల్ విప్లవం, మౌలిక సదుపాయాల విస్తరణలో అద్భుతమైన ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు.

జాతీయ ప్రయోజనాల పరిరక్షణలోనూ కేంద్ర ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని మంగళవారం గవర్నర్ పత్రిక ప్రకటనలో తెలిపారు. ‘వికసిత్‌‌ భారత్‌‌–2047’ లక్ష్య సాధన దిశగా చేపడుతున్న కార్యక్రమాలు భారత్‌‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దనున్నాయని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్‌‌ మరిన్ని విజయాలు సాధించి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.