వాహనాలపై TS మాయమై.. TG వస్తుందా..?

వాహనాలపై TS మాయమై.. TG వస్తుందా..?

వాహనాలు నెంబర్ ప్లేట్ పై ఉండే మొదట రెండు ఇంగ్లీష్ అక్షరాలు రాష్ట్ర కోడ్ ని సూచిస్తాయి. అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిన వెహికల్స్ కు నెంబర్ కు ముందు TS ఉంటుంది. ఈ TSను రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ TGగా మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైయాక అప్పటి TRS ప్రభుత్వం కోరిక మేరకు (TS)  కోడ్ ను  రాష్ట్రాంలోని వాహనాలకు పెట్టాలని నిర్ణయించుకుంది. 

ఆ సమయంలో పత్రిపక్షాలు, ఇతర పార్టీలు టీఆర్ఎస్ (BRS)ను పోలినట్లు  TS అనే కోడ్ నెంబర్ ప్లేట్ పై పెట్టడాన్ని తప్పుబట్టాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తాజాగా ఈ టాపిక్ మళ్లీ చర్చనీయాంశమైంది. ప్రభుత్వం రాష్ట్ర మోటారు వాహనాల చట్టాన్ని సవరించాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వపర్గాల ద్వారా తెలుస్తోంది.

ఈ రోజు మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు కానుంది. ఈ కాబినేట్ సమావేశంలో 20 అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కుల గణన, బడ్జెట్ సమావేశాల షెడ్యూల్, గ్రూప్-1 పోస్టుల పెంపు వంటి అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. వాటితో పాటు వెహికల్ రిజిష్ట్రేషన్ నెంబర్ ప్లేట్ పై ప్రస్తుతం ఉన్న TSను TGగా మార్చే నిర్ణయం తీసుకుంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీని కోసం రాష్ట్ర మోటారు వాహనాల చట్టాన్ని సవరణ చేయాల్సి ఉంటుంది.