భారీ వ‌ర్షాలు.. రెండు రోజులు సెలవులు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

భారీ వ‌ర్షాలు.. రెండు రోజులు సెలవులు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ న‌గ‌రంలో భారీ వ‌ర్షాలు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాలు జ‌ల‌మ‌య్యాయి. రోడ్ల‌న్ని వాగుల‌ను త‌ల‌పిస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచించారు. హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు జిల్లాల్లోని లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతుండడంతో ప్రభుత్వం..  రెండు రోజులు సెల‌వులు ప్రక‌టించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేటు ఇన్‌స్టిట్యూషన్స్, బ్యాంకింగ్ సంస్థలు, ఫైనాన్సియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు ఇవ్వాళ‌, రేపు సెలవులు ప్రకటించింది. ఈ మేర‌కు సీఎస్ సోమేష్ కుమార్ జీవో జారీ చేశారు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881 ప్రకారం ఈ సెలవుపు ప్రకటించినట్లు పేర్కొన్నారు.