
- జిల్లాలకు నిధుల కేటాయింపు, బిల్లుల సమర్పణకు సర్క్యులర్ జారీ
హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ కాంపోనెంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.563.24 కోట్ల నిధులు మంజూరు చేసింది. స్టేట్ నోడల్ అకౌంట్ (ఎస్ఎన్ఏ) స్పర్శ్ మోడ్ ద్వారా ఈ నిధులను జిల్లాలకు కేటాయించారు. ఖర్చు వివరాలు, బిల్లులను వెంటనే హైదరాబాద్‌లోని పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ (పీఏవో) కార్యాలయానికి సమర్పించాలని అధికారులను ఆదేశిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (పీఆర్ & ఆర్డీ) డైరెక్టర్ సృజన సోమవారం సర్క్యులర్ జారీ చేశారు.