గూడ పవన్‌‌‌‌కు నేషనల్ యంగ్ వీవర్ అవార్డు .. జాతీయ చేనేత అవార్డులను ప్రకటించిన కేంద్రం

గూడ పవన్‌‌‌‌కు నేషనల్ యంగ్ వీవర్ అవార్డు .. జాతీయ చేనేత అవార్డులను ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రం ప్రకటించిన జాతీయ చేనేత అవార్డుల్లో తెలంగాణకు చెందిన గూడ పవన్‌‌‌‌కు నేషనల్ యంగ్ వీవర్ అవార్డు దక్కింది. ఈ మేరకు సోమవారం కేంద్ర జౌళి మంత్రిత్వ అవార్డులను ప్రకటించింది. సహజ రంగులతో డబుల్ ఇక్కత్ సిల్క్‌‌‌‌ చీర తయారీకి గాను పవన్‌‌‌‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్రం ప్రకటించింది. 

అలాగే, మార్కెటింగ్ రంగంలో నరేంద్ర హ్యాండ్లూమ్స్‌‌‌‌కు మరో అవార్డు దక్కింది. ఆగస్టు 7న 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేయనున్నారు. 5 సంత్ కబీర్ అవార్డులు, 19 జాతీయ చేనేత అవార్డులు సహా మొత్తం 24 మంది అవార్డు గ్రహీతలకు చేనేత రంగంలో చేసిన అత్యుత్తమ  కృషికి గాను సత్కరించున్నారు.